Twisha Sharma Death Case: తెలుగు న‌టి ట్విష మృతి కేసులో అత్త అరెస్టు

ABN , Publish Date - May 29 , 2026 | 07:55 AM

మాజీ మిస్ పుణె, తెలుగు నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Twisha Sharma Death Case

మాజీ మిస్ పుణె, తెలుగు నటి ట్విషా శర్మ (Twisha Sharma Death Case) అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు సహకరించడం లేదనే కారణంతో ట్విష అత్త, విశ్రాంత న్యాయమూర్తి అయిన గిరిబాలాసింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

ఆమెకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన మరుసటి రోజే ఈ అరెస్టు జరిగింది. గురువారం ఉదయం 10.30 గంట లకు భోపాల్ లోని గిరిబాలాసింగ్ నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచా రించి.. సాయంత్రం 5.10 గంటల సమయంలో అరెస్టు చేశారు. ట్విషా శర్మ తెలుగులో 2021లో వచ్చిన 'ముగ్గురు మొనగాళ్ళు' సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఇది కూడా చదవండి:

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 29 , 2026 | 02:21 PM