Rakul Preet Singh: పీఆర్ దారి తప్పింది! వారికి నిద్ర ఎలా పడుతుంది
ABN, Publish Date - Feb 04 , 2026 | 12:02 PM
బాలీవుడ్‌లో పీఆర్ వ్యవస్థ హద్దులు దాటుతోందని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు. ఒకరిని ప్రోమోట్ చేయడానికి మరొకరిని తక్కువ చేయడం మంచిది కాదన్నారు.
బాలీవుడ్‌లోని పబ్లిసిటీ సంస్కృతి ఒకప్పటితో పోలిస్తే చాలా మారిపోయిందని రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అన్నారు. ఒకరిని తరచూ వార్తల్లో ఉంచడం కోసం మరొకరిని తక్కువ చేసి చూపే ఆ ధోరణి మంచిది కాదని ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘ప్రచారం అందరికీ అవసరమే. తరచూ హెడ్‌లైన్స్‌లో ఉండాలని నటీనటులపై ఒత్తిడి ఉంటుంది. మనం చేసే పనే మనమేంటో చెప్పాలి అని నేను నమ్ముతాను. కానీ చేసే పని కంటే ప్రచారంతోనే అందరి దృష్టిని ఆకర్షించాలి అని అక్కడి పీఆర్ వ్యవస్థ ప్రయత్నిస్తోంది. ప్రచారం కోసం హద్దులెందుకు దాటాలి? అయినా ఒకరిని హైలైట్ చేయడానికి ఇతరులపై వ్యతిరేకతను ఎందుకు ప్రచారం చేయాలి.
ఇలా చేసేవారికి నిద్ర ఎలా పడుతుంది అని ఆలోచిస్తుంటాను. మనం చేసే మంచి పనులే మనకు అవకాశాలు తెచ్చి పెడుతుంటాయని నేను భావిస్తాను. దేవుడు అంతా చూస్తుంటాడు. అలాగే నటీనటులు బయటకు వచ్చినప్పుడల్లా వారి అనుమతి లేకుండా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించడం ఇబ్బందిగా ఉంటుంది’ అని రకుల్ చెప్పారు. ప్రస్తుతం ‘పతీ పత్నీ ఔర్ ఓ దో’ చిత్రంలో నటిస్తున్నారు రకుల్.