సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Diljit Dosanjh: హిందుస్థాన్ ఎవరి సొత్తూ కాదు.. దిల్జీత్ దొసాంజ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 17 , 2026 | 09:00 AM

హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తూ కాదంటూ పంజాబీ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ వ్యాఖ్యానించారు. ఇండోర్ కచేరీలో ఆయన చేసిన కామెంట్స్, పాటల వివాదంపై పూర్తి వివరాలు.

Diljit Dosanjh

హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తూ కాదని, దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉందని, ఈ దేశంపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్ (Diljit Dosanjh) అన్నారు. ఈ నెల 15న మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిర్వహించిన సంగీత కచేరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కచేరీ జరగకుండా కొందరు అడ్డంకులు సృష్టించారని ఆయన గుర్తు చేశారు.

ఇండోర్ మహా కాలుడి నేల అని, తనను రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. అభిమానులను కలుసు కోకుండా తనను ఎవ్వరూ భయపెట్టలేరని ఆయన అన్నారు. తనను అభిమానుల నుంచి దూరం చేయాలని ఎవరూ ప్రయత్నించినా భయపడేది లేదని తేల్చిచెప్పారు.

కచేరీకి వారం ముందే మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్న నాలుగు పాటలు పాడవద్దని ఆయనకు జిల్లా అధికారులు సూచించారు. చిన్నారులపై ప్రభావం చూపేలా ఉన్నాయంటూ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని గుర్తు చేశారు. అయినా.. వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని పాటలు పాడవద్దని అధికారులు ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా దొసాంజ్ పాడటం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Updated Date - Nov 17 , 2026 | 09:00 AM