Nadheem Khan: దురంధర్ నటుడి వికృత రూపం.. పనిమనిషికి పదేళ్లుగా నరకం చూపిస్తూ..
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:20 PM
బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ (Nadheem Khan) ను మాల్వానీ పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్లుగా పనిమనిషిపై అత్యాచారం చేస్తూ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్న కేసులో అతనిని అరెస్ట్ చేశారు.
Nadheem Khan: బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ (Nadheem Khan) ను మాల్వానీ పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్లుగా పనిమనిషిపై అత్యాచారం చేస్తూ.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్న కేసులో అతనిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తివివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 41 ఏళ్ల నదీమ్ ఖాన్ బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అతడి ఇంట్లో ఒక మహిళ 2015 నుంచి పనిచేస్తుంది. అయితే ఆమెపై నదీమ్ చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటే మాట దాటేస్తున్నాడు. ఇలా పదేళ్లుగా ఆమెకు నరకం చూపిస్తున్నాడు.
ఇక నదీమ్ పెట్టే నరకాన్ని భరించలేక సదురు మహిళ పోలీసులను ఆశ్రయించింది. పదేళ్లుగా అతను చేస్తున్న వికృత చేష్టలను ఏకరువు పెట్టింది. పెళ్లి పేరుతో మోసం చేసిన అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది. ఇక ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు మహిళ చెప్పింది మొత్తం నిజమే అని తెలుసుకొని నదీమ్ ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది.
నదీమ్ ఖాన్.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగాడు. గతేడాది రిలీజ్ అయిన దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా వంటమనిషిగా అతడు నటించాడు. ఈ సినిమా అతని లైఫ్ ని మార్చేసింది. ప్రస్తుతం నదీమ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అతడి వికృత రూపం బయటపడడం.. అతని కెరీర్ కి గండి కొట్టినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.