బిగ్ బి వారసురాలి ఎంట్రీ ఎప్పుడు? ఆరాధ్య ఎలా ఉందో చూశారా!
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:52 PM
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ గురించిన వార్త ఏదైనా సరే సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఆరాధ్య తన ఫ్యామిలీతో కలిసి విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది.
బాలీవుడ్ స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) దంపతుల ముద్దుల కుమార్తె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Big B Amitabh Bachchan) మనవరాలు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) గురించిన వార్త ఏదైనా సరే సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఈ స్టార్ ఫ్యామిలీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో ఆరాధ్యను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పటి నుంచి చైల్డ్ లుక్‌లోనే చూసిన ఆరాధ్య, ఇప్పుడు ఒక్కసారిగా ఎంతో ఎత్తుగా, ఎంతో క్యూట్‌గా, క్లాసీ అండ్ గ్లామరస్ లుక్‌లో దర్శనమిచ్చింది.
ఆరాధ్య సరికొత్త లుక్ చూస్తుంటే త్వరలోనే ఆమె హీరోయిన్‌గా చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన తల్లి ఐశ్వర్య రాయ్ తరహాలోనే ఆకట్టుకునే రూపం, చార్మింగ్ ప్రెజెన్స్‌తో కనిపిస్తున్న ఆరాధ్య గ్లామర్‌కు భవిష్యత్తులో బాలీవుడ్ మొత్తం ఊగిపోవడం ఖాయమనేలా ఉంది. అయితే ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? బిగ్ బి కుటుంబం ఆమె సినీ ప్రవేశం గురించి ఎలాంటి ఆలోచనలో ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా, ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్‌ను బట్టి ఆమె నేరుగా భారీ సౌత్ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తుందా అనే కోణంలోనూ విశ్లేషణలు మొదలయ్యాయి.
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల వారసత్వాన్ని మోస్తూ ఆరాధ్య కనుక కథానాయికగా అడుగుపెడితే, ఆమెకు బ్రేక్ ఇచ్చేందుకు అటు బాలీవుడ్, ఇటు సౌత్ స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టడం ఖాయం. ప్రస్తుతం చదువుపై శ్రద్ధ వహిస్తున్న ఆరాధ్య, సరైన వయసు రాగానే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోందని బాలీవుడ్ టాక్. ఏది ఏమైనా ఆరాధ్య లేటెస్ట్ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ మాత్రం నెటిజన్లను, అమితాబ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
విశాల్ ‘మకుటం’ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్.. ఎప్పుడంటే
చిన్న పట్టణాలకూ పీవీఆర్ ఐనాక్స్.. ఇక సింగిల్ స్క్రీన్ల కాలం చెల్లినట్టేనా
మేఘన మిస్సింగ్.. డైరెక్టర్ వి.వి.వినాయక్ ఏం చేశారంటే