సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆమిర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..   

ABN, Publish Date - Jul 18 , 2026 | 03:30 PM

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు (Aamir Khan) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence bishnoy) గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  దీనికి సంబంధించి  ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆమిర్‌ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తెర  తీసారని, ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని, భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.  ఇటీవల ఆమిర్‌ ఖాన్‌ చిరకాల స్నేహితురాలు  గౌరీ స్ప్రాట్ ను  వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కూడా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులకు ఇదే గ్యాంగ్ పేరుతో బెదిరింపులు వచ్చిన ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ

KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే

చిరుకి వదినగా చేసినా.. నాగ్‌ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ

Updated Date - Jul 18 , 2026 | 03:41 PM