Aamir Khan: తెరపై కొడుకుని చూసి,, చిన్న పిల్లాడిలా..
ABN, Publish Date - Apr 27 , 2026 | 12:24 PM
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. ఇందులో ఆయన రోహన్ పాత్రలో కనిపిస్తారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్‌దిన్’. ఇందులో ఆయన రోహన్ పాత్రలో కనిపిస్తారు. జునైద్, సాయిపల్లవి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆమిర్ ఖాన్. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్పెషల్ షో చూసి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు ఆమిర్. ఆ పక్క సీట్లో కూర్చున్న సాయిపల్లవి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించిన చిత్రమిది.