సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సన్నీ మూవీ పైనే.. ఆమీర్ ఖాన్ ఆశలు!

ABN, Publish Date - Feb 12 , 2026 | 06:20 PM

ఆయనే స్టార్ హీరో.. కానీ తన కెరీర్ ఆశలన్నీ మరో హీరోతో తీస్తున్న మూవీపై పెట్టుకున్నాడు. ఖర్చెంతయినా పరవాలేదు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాడు. అందుకోసం ఎంతో తపన పడుతున్నాడు.

sunny

సన్నీ డియోల్ (Sunny Deol) ఇప్పుడు బాలీవుడ్‌లో రివైవల్ కింగ్‌లా మారిపోయారు. మొన్నటి వరకూ ఆయన ఏజ్ అయిపోయింది, ఇక కెరీర్ క్లోజ్ అయిపోయినట్టేనని చాలా మంది విమర్శించారు. కానీ వయసు మీద పడే కొద్ది ఎనర్జిటిక్‌గా మారిపోతున్నాడు. 60 ఏళ్ళు దాటినా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో జనం ముందుకు వస్తున్నాడు. మూడేళ్ళ క్రితం సన్నిడియోల్ నటించిన 'గద్దర్ 2' చిత్రం ఘన విజయం సాధించి, వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. గత యేడాది వచ్చిన 'జాట్' మూవీ సైతం గౌరవప్రదమైన విజయాన్ని అందుకుంది.

రీసెంట్‌గా వచ్చిన 'బార్డర్ 2' మూవీ కూడా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఇప్పుడు తన ఆశలన్నీ సన్నీ డియోల్‌తో నిర్మిస్తున్న 'లాహోర్ 1947' మూవీపై పెట్టుకున్నాడు. రాజ్ కుమార్ సంతోషి (Rajkumar Santoshi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమీర్ ఖానే నిర్మాత కావడం విశేషం. ఈ మూవీతోనే ప్రీతీ జింటా (Preity Zinta) రీ-ఎంట్రీ ఇస్తోంది. ఇందులో కీలక పాత్రలను షబానా ఆజ్మీ (Shabana Azmi), అలీ ఫజల్ (Ali Fazal), కరణ్ డియోల్ చేస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్‌కు ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) మ్యూజిక్ కూడా తోడవనుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

1947 దేశ విభజన నేపథ్యంలో ఎమోషనల్ పీరియడ్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. ఈ యేడాది ఆగస్టు 13న, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మూవీ విడుదల కానుంది. 'గద్దర్ 2' మూవీ కూడా అదే టైమ్‌లో వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో ఇది కూడా అలాగే భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అమీర్ ఖాన్ సొంత సినిమా 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత పరాజయాలతో కాస్తంత ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాజెక్ట్‌తో మళ్ళీ ఆమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకుంటారేమో చూడాలి.

Updated Date - Feb 12 , 2026 | 06:20 PM