'త్రీ ఇడియట్స్' సీక్వెల్.. ఫోర్త్ ఇడియట్‌గా విక్కీ కౌశల్
ABN , Publish Date - May 05 , 2026 | 06:17 PM
'త్రీ ఇడియట్స్' మూవీకి సీక్వెల్ రెడీ అవుతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు ఈ సారి 'అంతకు మించి' అన్నట్టు కొన్ని సూపర్ ఎలిమెంట్స్ యాడ్ కాబోతున్నాయట. ఈ సీక్వెల్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతోందట! అదేంటో తెలుసుకుందాం.
బాలీవుడ్‌లో పాత రికార్డులు బద్దలు కొట్టిన మూవీ '3 ఇడియట్స్'. ఈ మూవీకి సీక్వెల్ వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అడుగు ముందుకు పడలేదు. ఏళ్లు గడుస్తున్నా దానికి సంబంధించిన అప్డేట్స్ లేవు. అయితే తాజాగా ఈ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. '3 ఇడియట్స్'కు మరింత ఎంటర్ టైన్ మెంట్ యాడ్ కాబోతోంది. నిజమే... '3 ఇడియట్స్' సీక్వెల్‌లో 'ఫోర్త్ ఇడియట్' కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'త్రీ ఇడియట్స్' మూవీలోని అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి పాత్రలు ఈ సీక్వెల్‌లోనూ కొనసాగుతాయి. అయితే నాలుగో హీరోగా 'ఛావా' ఫేమ్ విక్కీ కౌశల్ కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రాజ్‌కుమార్ హిరానీ నే 'త్రీ ఇడియట్స్' సీక్వెల్‌నూ డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి అభిజిత్ జోషి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. విక్కీ కౌశల్ ఈ స్క్రిప్ట్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడట. రాజ్ కుమార్ హిరానీ మూవీ 'డంకీ'లో కీలక పాత్ర పోషించిన విక్కీ కౌశల్ ఇప్పుడీ సినిమాలోనూ నటించడానికి పచ్చ జెండా ఊపాడట. 2027 సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ లోగా ఈ హీరోలు నలుగురు తమ కమిట్‌మెంట్స్ ను పూర్తి చేసుకుంటారట. మరి ఈ నలుగురు ఇడియట్స్ ను రాజ్ కుమార్ హిరానీ తెర మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.
Read Also: గ్లోబల్ స్టేజ్‌పై వారణాసి హంగామా!
Read Also: సమంత వర్సెస్ కరీనా!