Thug Life: కమల్, అభిరామి లిప్ లాక్... నెటిజన్స్ ఫైర్...

ABN , Publish Date - May 19 , 2025 | 10:17 AM

హీరోయిన్లకు లిప్ లాక్ ఇవ్వడం కమల్ హాసన్ కు కొత్తేమీ కాదు... తాజాగా విడుదలైన 'థగ్ లైఫ్'లోనూ కమల్... నటి అభిరామికి లిప్ లాక్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) తాజా చిత్రం 'థగ్ లైఫ్' (Thug Life) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ సృష్టిస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం (Maniratnam) దశాబ్దాల క్రితం 'నాయకుడు' (Nayakudu) సినిమా చేశారు. మళ్ళీ ఇంతకాలానికి వీరు కలిసి చేసిన చిత్రం 'థగ్ లైఫ్'. జూన్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు చూసి అభిమానులు నోరెళ్ళబెడుతున్నారు. ఈ వయసులోనూ కమల్ ఇంత ఎనర్జిటిక్ గా యాక్షన్ సీన్స్ చేయడం గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఈ ట్రైలర్ లోని కొన్ని అంశాలు చర్చకు దారితీశాయి.


kt1.jpg

70 సంవత్సరాల కమల్ హాసన్ 42 సంవత్సరాల అభిరామి (Abhirami)కి లిప్ లాక్ ఇవ్వడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. నిజానికి కొంతకాలం క్రితం కమల్ హాసన్ సినిమాల్లోనూ, వాటి ప్రమోషన్స్ కోసం విడుదల చేసే ట్రైలర్స్ లోనూ లిప్ లాక్ ఉండేది. సౌత్ లోని ప్రముఖ హీరోల్లో ఇలా లిప్ లాక్స్ అధికంగా పెట్టిన వ్యక్తి కమల్ హాసన్ మాత్రమే అనే వారూ లేకపోలేదు. గతంలో 'పోతురాజు' (Pothuraju) సినిమాలోనూ కమల్ హాసన్, అభిరామి ఇంటిమేట్ సీన్స్ లో నటించి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ జంట మళ్ళీ ఇప్పుడు ఇంత కాలానికి ఆ స్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ పండించడం చర్చనీయాంశంగా మారింది. అలానే మూడు పదుల వయసున్న త్రిష నూ కమల్ హాసన్ ముగ్గులోకి దించేలా కొన్ని సీన్స్ ఉండటాన్ని కూడా నెటిజన్స్ తప్పుపడుతున్నారు. 'థగ్ లైఫ్' ట్రైలర్ లో ఈ సన్నివేశాలను పెట్టడం వల్ల మణిరత్నం ఏం చెప్పదల్చుకున్నాడో అర్థం కావడంలేదని, ఇలాంటి సన్నివేశాలు సినిమాలో ఉంటే... సమయం సందర్భం ప్రకారం వాటిని అర్థం చేసుకోచ్చు కానీ ఇలా ట్రైలర్ లో పెట్టడం సబబు కాద'ని విమర్శిస్తున్నారు.


కమల్ హాసన్ లిప్ లాక్ సీన్స్ ను విమర్శిస్తున్న వారిలో తెలుగు వారూ లేకపోలేదు. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 'డాకు మహారాజ్' (Daaku Maharaj) విడుదలైనప్పుడు, రవితేజ (Raviteja) 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) మూవీ రిలీజ్ అయినప్పుడు హీరోయిన్స్ తో వారు చేసిన రొమాన్స్ ను తమిళ సినీ అభిమానులు బాగా విమర్శించారు. వీరిద్దరినీ ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నట్టుగా వారిద్దరి ఫ్యాన్స్... కమల్ హాసన్ లిప్ లాక్ సీన్స్ ను విమర్శించడం మొదలెట్టారు. ఏదేమైనా... అటు చేసి ఇటు చేసి... సోషల్ మీడియాలో 'థగ్ లైఫ్' సినిమా గురించి జనాలు చర్చించుకోవడం మాత్రం ఎక్కువైంది. ఈ కారణంగానైనా... సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది.

Also Read: Anasuya Viral Post: అనసూయ.. ఆంజనేయుడు వచ్చాడు.. ఎంత భాగ్యం...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 19 , 2025 | 10:57 AM