సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela engagement: శ్రీలీల నిశ్చితార్థం.. కమింగ్‌ సూన్‌..

ABN, Publish Date - May 31 , 2025 | 12:31 PM

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమా అవకాశం అందుకున్నారు. తాజాగా ఈమె గురించి నెట్టింట ఓ వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు శ్రీలీల (Sreeleela). ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమా అవకాశం అందుకున్నారు. తాజాగా ఈమె గురించి నెట్టింట ఓ వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది. శ్రీలీల త్వరలో ఓ ఇంటిది కాబోతుంది అన్నది ఆ వీడియో సారాంశం. శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ వీడియో, ఫొటో షేర్‌ చేసింది. ఆమెకు పసుపు రాసి, కొందరు ఆశీర్వదిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. ఈరోజు నాకు ‘బిగ్‌ డే’ (Big Day For Sreeleela) అంటూనే పూర్తి వివరాలు ‘కమింగ్‌ సూన్‌’ అంటూ హింట్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్‌గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Sreeleela engagement)

అయితే అసలు విషయం ఇది నిశ్చితార్థం కాదని సమాచారం. జూన్‌ 14న శ్రీలీల పుట్టినరోజు. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్‌ చేసుకున్నట్లు సన్నిహితులు నుంచి సమాచారం. ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్‌. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను ఈరోజుల్లో కూడా తిధి ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్‌ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు. అయితే ఆ ఫొటోల గురించి శ్రీలీల ఎలాంటి హింట్‌ ఇవ్వలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు ‘బిగ్‌ డే’ అంటూ.. తెలిపింది అంతే! అయితే ఇక్కడ మరో టాక్‌ కూడా నడుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో కార్తిక్‌ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తోంది. ఆ సిపిమాకు సంబంధించి ప్రమోషనల్‌ కంటెంట్‌ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్‌ కావచ్చని అంటున్నారు.

బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఈ జంట ఓ సినిమా చేస్తున్నారు.బ ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్‌ వచ్చింది. కార్తిక్‌ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం జరిగిన ‘ఐఫా’ వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్‌ ఆర్యన్‌ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం’ అని ఆమె చెప్పారు. శ్రీలీల ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు.. మంచి డాన్స్‌ర్‌ కూడా. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదువుతుంది.

Updated Date - May 31 , 2025 | 12:31 PM