సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Zootopia 2: తెలుగులోనూ రాబోతున్న క్రేజీ యానిమేషన్ మూవీ

ABN, Publish Date - Jul 31 , 2025 | 06:09 PM

వాల్ట్ డిస్నీ యానిమేషన్ సంస్థ నుండి వస్తున్న 64వ ఫీచర్ ఫిల్మ్ 'జూటోపియా -2' ఈ సినిమా నవంబర్ 28న తెలుగులోనూ విడుదల కాబోతోంది.

Zootopia 2 Movie

యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్స్ ను రూపొందించడంలో వాల్ట్ డిస్నీ యానిమేటెడ్ స్టూడియోస్ (Walt Disney Animation Studios) కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ తాజాగా తన 64వ యానిమేటెడ్ మూవీని జనం ముందుకు తీసుకురాబోతోంది. అడ్వంచరస్ యానిమేటెడ్ మూవీ 'జూటోపియా -2' (Zootopia -2) ను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో నవంబర్ 28న విడుదల కాబోతోంది. భారతదేశంలోనూ ఇంగ్లీష్‌, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.


'జూటోపియా' (Zootopia) మొదటి భాగం 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దాంతో అప్పటి నుండి దీనికి కొనసాగింపుగా మరో సినిమా తీయాలని ప్రయత్నించిన ఈ సంస్థ ఇప్పటికి దాన్ని పూర్తి చేసి జనం ముందుకు తీసుకురాబోతోంది. క్రైసస్ కౌన్సింగ్ ను నిర్వహించే సంస్థకు కొత్తగా వివాహం చేసుకున్న ఓ కుందేలు, నక్క వస్తాయి. తమ మధ్య అనుబంధం సరిగా లేదని అవి గుర్తిస్తాయి. అదే సమయంలో యానిమల్ మెట్రోపోలిస్ లోకి ఓ పాము ప్రవేశించడంతో అక్కడ చిందరవందర గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఈ యానిమేషన్ మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో దీనిపై క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని తాజా ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఈ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ను జారెడ్ బుష్, బైరాన్ హోవార్డ్ డైరెక్ట్ చేశారు.

Updated Date - Jul 31 , 2025 | 06:21 PM