ER Yamini : యూట్యూబర్ యామినితో స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:58 PM
అచ్చ తెలుగు అమ్మాయి ఇ.ఆర్. యామిని ఆడినా, పాడిన అమితంగా ఇష్టపడేవారు లక్షల్లో ఉన్నారు. ఆమె విజయ రహస్యం ఏమిటీ? ఇంజనీరింగ్ చదివి యామిని ఎందుకు యూట్యూబర్ గా మారింది... ఆమె మాటల్లోనే చూడండి...
అచ్చ తెలుగు అమ్మాయి ఇ.ఆర్. యామిని చదివింది ఇంజనీరింగ్. యూట్యూబర్ గా మారి లక్షలాదిమంది హృదయాలను దోచుకుంది యామిని.
పల్లెటూరి పిల్లగా కెమెరా ముందుకొచ్చి ఆమె ఆడితే... అభిమానులు ఆడారు, ఆమె పాడితే.. వారూ పెదవులు కదిపారు. ఆమె నాట్యం చేస్తే.. వాళ్ళూ కాలు ఆడించారు. ఇలా యామిని కి వారంతా ఫిదా అయిపోయారు.
అలాంటి యామిని ఒక్కసారిగా పెళ్ళి చేసుకుని ఆ వార్తను రివీల్ చేసే సరికీ ఎంతోమంది కుర్రకారుల గుండెలు బద్దలయ్యాయి. అయినా... ఆమె పాటలను ఆదరించడం మాత్రం వాళ్లు మానలేదు.
మరి యామిని తన పాటల గురించి, ఆటల గురించి, మనువాడిన పెనిమిటి గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే... ఈ క్రింది వీడియో ను క్లిక్ చేయండి.