సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Eshan Creations Ashok: ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుండి యోగా గురువుగా...

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:25 AM

ప్రముఖ పంపిణీదారుడు, ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ ఇప్పుడు యోగా గురువుగా మారిపోయాడు. అతను రూపొందించిన యోగా ఆంథమ్ సాంగ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్ం లక్షరూపాయల బహుమతి ఇచ్చింది.

సినిమా రంగంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థం కాదు. ఆ మధ్య వరకూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ (Eshan Creations Ashok) హఠాత్తుకు ఈ రంగానికి స్వస్తి పలికి యోగా గురువుగా మారిపోయారు. ఆయన రూపొందించిన 'యోగా ఆంథమ్'ను 20వ తేదీ ప్రముఖ దర్శకుడు మారుతి (Director Maruthi) ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు.


మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Manisharma) 'యోగా ఆంథమ్'కు స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) దీనికి సాహిత్యం అందించారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మారుతి తొలుత మాట్లాడుతూ, 'యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత కావాలి. యోగా ఆంథెమ్ సాంగ్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖలో ఆయన యోగా డే సెలబ్రేషన్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీలో జరుగుతున్న యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో ఈ యోగా ఆంథెమ్ ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవడం సంతోషకరం. ఈ పాట ద్వారా ఇషాన్ క్రియేషన్స్ అశోక్ గారు మోదీ గారిని కలిసే అవకాశం దక్కించుకున్నారు. యోగాకు మతం లేదు. అందరూ ఆరోగ్యం కోసం యోగాను ప్రాక్టీస్ చేయాలి. మనకు అతి తక్కువ ఖర్చుతో చేసుకునే వ్యాయామం యోగా. ఈ పాటను మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ గారు అందరికీ అర్థమయ్యేలా మంచి లిరిక్స్ రాశారు. అశోక్ డిస్ట్రిబ్యూటర్ గా నాకు తెలుసు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో నష్టాలు వచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టి మంచి పొజిషన్ కు వచ్చారు. అలాగే అన్ని శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు తిరిగి, యోగా గురించి తెలుసుకుని, యోగాకు ప్రచారం చేస్తున్నారు. వారు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, 'మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అలా మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా. ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు ఉపయోగించి రాశాను. సంస్కృతాన్ని దైవ భాష అని అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో పాట రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు థ్యాంక్స్. యోగాకు ప్రచారం కల్పిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులు అందరికీ ధన్యవాదాలు' అని అన్నారు.


ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ మాట్లాడుతూ, 'నేను డిస్ట్రిబ్యూటర్ గా పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను పంపిణీ చేశాను. అప్పటి నుంచే మారుతి గారి సపోర్ట్ ఉండేది. ఆ తర్వాత 'శంకరాభరణం, కళావతి' అనే మూవీస్ పంపిణీ చేసి నష్టపోయాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకునే టైమ్ లో మారుతి గారు పిలిచి నీకు మంచి రోజులు వస్తాయి. వెయిట్ చేయి అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటు ఉండేది. డిస్ట్రిబ్యూషన్ ఆపేశాక ఏడాదిపాటు రోజుకు 18 గంటలు యోగా ప్రాక్టీస్ చేశాను. 17 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు దర్శించాను. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు పెట్టాను. ఇంటర్నేషనల్ యోగా డే పెట్టి 11 ఏళ్లవుతోంది. ఈసారి యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో మా యోగా ఆంథెమ్ సాంగ్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి గారు ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటకు నాకు ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు బహుమతి, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. యోగా డే న మోదీ గారిని కలిసే 50 మందిలో నాకు మొదటి అవకాశం కల్పించారు' అని చెప్పారు.

Also Read: Rajkumar Rao: మరోసారి నల్లకోటు ధరించి...

Also Read: Mohanlal: శ్రీలంక పర్యటన మరచిపోలేని జ్ఞాపకం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 21 , 2025 | 11:37 AM