Ravi Basrur: మాస్ కా దాస్ ఆవిష్కరించిన వీర చంద్రహాస ట్రైలర్

ABN , Publish Date - May 10 , 2025 | 04:52 PM

ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ దర్శకత్వం వహించిన 'వీర చంద్రహాస' చిత్రం ఇప్పుడు తెలుగులో రాబోతోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur) దర్శకత్వం వహించిన సినిమా 'వీర చంద్రహాస' (Veera Chandrahasa). దీనిని తెలుగులో ఎం.వి. రాధాకృష్ణ 'వీర చంద్రహాస' పేరుతో అనువదిస్తున్నారు. శివరాజ్ కుమార్ (Siva Rajkumar) నటించిన 'వేద', ప్రజ్వల్ దేవరాజ్ నటించిన 'రాక్షస' చిత్రాలను రాధాకృష్ణనే తెలుగులో డబ్ చేశారు. తాజాగా 'వీర చంద్రహాస' హక్కుల్నీ ఆయన పొందారు.

'' కేజీయఫ్ (KGF), సలార్ (Salaar)'' లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఒక సంచలనం సృష్టించారు రవి బస్రూర్. ఆయన దర్శకుడిగా ‘వీర చంద్రహాస’ చిత్రంతో సత్తా చాటుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఎన్ ఎస్ రాజ్‌కుమార్ దీనిని నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో రిలీజ్ చేయించారు. ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ''రవి బస్రూర్ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇప్పటి వరకు ఆడియెన్స్‌ను తనదైన సంగీతంతో అలరించగా, డైరెక్టర్‌‌గా గానూ తానెంటో ప్రూవ్ చేశారు. ఎమ్‌వీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.


ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ ''రీసెంట్‌గా కన్నడలో విడుదలైన ‘వీర చంద్రహాస’ చిత్రం హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి కూడా తెలుగు ఆడియెన్స్‌ బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. సినిమా సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతున్నా. తనదైన సంగీతంతో అందర్నీ మెప్పించిన రవి బస్రూర్ ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది'' అని అన్నారు.

సంగీత దర్శకుడు, దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ, ''డైరెక్టర్‌‌గా నేను రూపొందించిన ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. శివ రాజ్‌కుమార్ గారితో పాటు ఇందులో నటించిన నటీనటులంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమ్‌వీ రాధాకృష్ణ మా చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు'' అని అన్నారు.

Also Read: Megastar: జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 10 , 2025 | 05:03 PM