Megastar: జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్
ABN , Publish Date - May 10 , 2025 | 04:07 PM
'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం రీ-రిలీజ్ ఫస్ట్ డే రూ. 1.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాను త్రీడీలోనూ విడుదల చేయడం విశేషం.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రాన్ని మూడున్నర దశాబ్దాల తర్వాత మరోసారి చిత్ర నిర్మాత అశ్వినీదత్ రిలీజ్ చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో సోషియో ఫాంటసీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా దీనిని అప్ డేట్ చేయడంతో పాటు 2డీ లోనే కాకుండా త్రీడీలోనూ వైజయంతి మూవీస్ సంస్థ విడుదల చేసింది. అదే సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1.75 కోట్ల గ్రాస్ ను ఓపెనింగ్ డే కలెక్ట్ చేసిందని అశ్వినీదత్ తెలిపారు.
శుక్రవారం విడుదలయిన సినిమాలన్నింటికీలోకి చాలా కేంద్రాలలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమానే ఎక్కువ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. 35 యేళ్ళ క్రితం ఈ సినిమా విడుదల సమయంలో తుఫాన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైపోయింది. అలానే ఇప్పుడు కూడా సినిమా విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు భారత్ - పాక్ మధ్య యుద్థ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనూ 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' మూవీని ఫ్యామిలీస్ తో కలిసి చాలామంది వీక్షించడం విశేషం.
Also Read: Ranveer Singh: మేం ఎవరినీ ఇబ్బందిపెట్టం.. మా జోలికి వస్తే వదిలిపెట్టం...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి