సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

VISA: అమెరికా నేపథ్యంలో వింటారా సరదాగా...

ABN, Publish Date - Jul 12 , 2025 | 06:41 PM

ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న మూడో సినిమా 'వీసా - వింటారా సరదాగా' త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఒక పక్క స్టార్స్ తో భారీ చిత్రాలను నిర్మిస్తూనే, మరో వైపు వర్థమాన తారలను, సాంకేతిక నిపుణులను ఎంకరేజ్ చేస్తూ మీడియం బడ్జెట్ మూవీస్ నూ ప్రొడ్యూస్ చేస్తోంది. అలా ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం 'వీసా: వింటారా సరదాగా' (VISA Vintara Saradaga). అశోక్ గల్లా (Ashok Galla), శ్రీగౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో ఉద్ధవ్ రఘు (Udbhav Raghu) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


'వీసా - వింటారా సరదాగా' చిత్రం టీజర్ ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ యూత్ ఫుల్ గా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ సరదాగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో ఆసక్తికరంగా ఉంది. కథానాయకుడికి పాడ్‌కాస్టింగ్ అలవాటు ఉండటం టీజర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటి నుండి దూరంగా జీవితాన్ని గడుపుతున్న ఒక తరం జీవితాలను ప్రతిబింబించేలా ఇందులోని పాత్రలు ఉన్నాయి. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌ను మరింత ఉన్నతంగా మలిచింది. అతి త్వరలోనే సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా జనం ముందుకు రానుంది.

Updated Date - Jul 12 , 2025 | 06:46 PM