Bhadrakaali : 'భద్రకాళి' నుంచి ప్రేమ గీతం
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:46 PM
మల్టీటాలెంటెడ్ హీరోకు హిట్ కరువైంది. డిఫరెంట్ జానర్లు ట్రై చేస్తున్నా అదృష్టం మాత్రం వరించడం లేదు. దీంతో అప్ కమింగ్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకోసం శాంపిల్ గా వదులుతున్న అప్ డేట్స్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.
విజయ్ అంటోనీ (Vijay Antony ) కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. విజయ్ నుంచి సినిమా వస్తుందంటే డిఫరెంట్ గా ఉంటుందనే టాక్ ఆడియెన్స్ లో ఉండేది. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. చేసిన సినిమాలు చేసినట్లు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా వస్తున్న 'భద్రకాళి' (Bhadrakaali) పై ఆశలు పెట్టుకున్నాడు.
వైవిధ్యమైన కథలతో తనదైన మార్క్ ను చాటుకున్న విజయ్ ఆంటోని, 'భద్రకాళి' కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. రూ.190 కోట్ల కుంభకోణం కథాంశంగా సాగే ఈ చిత్రంలో ఎన్నడూ కనిపించినంత స్టైలిష్, యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రమోషన్స్ కంటెంట్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. విజయ్ ఆంటోని 25వ చిత్రమైన దీనికి అరుణ్ ప్రభు (Arun Prabhu) దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను సర్వంత్ రామ్ క్రియేషన్స్, (Sarvanth Ram Creations) బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా రిలీజైన 'మారెనా... ఏదో మారెనా (Edo Maarena) అంటూ సాగే ఫీల్ గుడ్ లవ్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రేమకు కొత్త లయ వస్తున్నది అనే క్యాప్షన్తో వచ్చిన ఈ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో విజయ్, తృప్తి రవీంద్ర మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక ఈ మూవీకి విజయ్ అంటోనీనే మ్యూజిక్ అందించాడు. పాటతో సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాడు. ఈ పాటకు భాష శ్రీ సాహిత్యం అందించగా... అభిజీత్ అనిల్ కుమార్ వీనుల విందుగా పాడారు. మరీ ఈ మూవీతోనైనా విజయ్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Read Also: Neha Sharma: నేహాశర్మ.. కొత్త అవతారం! ఏకంగా ఆ హీరోతో
Read Also: Aryan Khan: షారుఖ్ కుమారుడు తక్కువేం కాదుగా.. సెటైర్లతో బాలీవుడ్‌పై విరుచుకు పడ్డాడు