Mirai Song: వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే ..
ABN, Publish Date - Jul 26 , 2025 | 10:41 AM
'వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే ..ఈ గ్లోబ్ ను ఆపే వైబ్ ఉందిలే' అంటున్నారు హీరో తేజ సజ్జా. హనుమాన్ సక్సెస్ తర్వాత అయన నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’ (Mirai) రితికా నాయక్ కథానాయిక. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. సెప్టెంబరు 5న ఈ సినిమా విడుదల కానుంది. మొత్తం 8 భాషల్లో 2డీ, త్రీడీల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. శనివారం ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. గౌర హరి సంగీతం అందించారు.