THE BENGAL FILES Teaser: పవర్‌ఫుల్‌గా ‘ది బెంగాల్ ఫైల్స్’ టీజర్
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:46 PM
1990లలో జమ్ము కశ్మీర్ లోని పండిట్ల పై జరిగిన ఊచకోతను కళ్లకు కట్టేలా ‘ది కశ్మీర్ ఫైల్స్’తో చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. ‘‘ఒకవేళ మిమ్మల్ని కశ్మీర్ కనుక బాధపెట్టి ఉంటే.. బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని టీజర్ లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్‌లోని సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి.