Hey Bhagawan Title: ఏ బిజినెస్ అనేది చెప్పను బ్రో..
ABN, Publish Date - Aug 18 , 2025 | 10:25 AM
సుహాస్, శివానీ నాగరం జంటగా నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. గోపి అచ్చర దర్శకుడు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫ్యామిలీ బిజినెస్ నేపథ్యంలో సాగే చిత్రంలా గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. బిజినెస్ నేపథ్యంలో సుహాస్, శివానీ మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.