The Girl friend: నవంబర్ 7న రండి.. మాట్లాడుకుందాం
ABN, Publish Date - Oct 04 , 2025 | 03:30 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్స్, పాటలు అలరించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. నవంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో రష్మిక మాటలు ఆకట్టుకుంటున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.