Mood Of Thammudu: ‘తమ్ముడు’ సినిమా ఆసక్తి రేకెత్తించేలా వీడియో
ABN, Publish Date - May 12 , 2025 | 06:32 PM
నితిన్ (Nithiin) హీరోగా వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘తమ్ముడు’ (Thammudu). ‘కాంతార’ ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియో ద్వారా ఆ క్యారెక్టర్లను పరిచయం చేసింది చిత్ర బృందం. ఆర్చరీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో అక్కా తమ్ముడి అనుబంధానికి పెద్ద పీట వేసినట్లు తెలిసింది. అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జులై 4న విడుదల కానుంది.