సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada: 'మల్లికా గంధ' సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Aug 16 , 2025 | 07:59 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా'. స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రాశి ఖన్నా కథానాయిక.  థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి 'మల్లికా గంధ' అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. సిద్ శ్రీరామ్ వాయిస్ మాటల్లో చెప్పలేనంత ఫీల్ ని ఇస్తుంది.  దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా మలిచారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్ కు మరింత బ్యూటీని యాడ్ చేశాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల  కానుంది. 

Updated Date - Aug 16 , 2025 | 07:59 PM