Thug Life : వైరల్ అవుతున్న థగ్స్ టాక్స్ -2
ABN, Publish Date - May 13 , 2025 | 06:40 PM
కమల్ హాసన్ కీలక పాత్రలో మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. 'నాయకన్’ చిత్రం వచ్చిన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రీచ్ కావాలని ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. అందులో భాగంగా థగ్స్ టాక్ పేరుతో రెండో ఎపిసోడ్‌ను రిలీజ్ చేశారు. అందులో కమల్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమా అనేది ఓ లాంగ్వేజ్ అన్న కమల్ ‘ఇట్ ఈజ్ మోస్ట్ డెమొక్రటిక్ లైఫ్ ఇన్ ద వరల్డ్’ అని చెప్పటం ఆకట్టుకుంటుంది. ‘థగ్ లైఫ్’ అనే సినిమా తన లైఫ్‌ని ఎక్స్‌టెన్స్ చేసిందని తెలిపారు. అలాగే త్రిష, శింబు, అశోక్ సెల్వన్ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు. మీరూ ఓ లుక్ వేయండి...