Baaghi 4 Trailer: ‘రక్తంతో నిండిన ప్రేమకథ’
ABN, Publish Date - Aug 30 , 2025 | 01:04 PM
టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాఘీ’ చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే. ఇప్పటికే మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు 'బాఘీ 4’ రాబోతుంది తెలుగులో ‘భీమా’తో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష బాఘీ 4’ను తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘రక్తంతో నిండిన ప్రేమకథ’ అంటూ ఈ యాక్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.