Alcohol Teaser: ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ 'ఆల్కహాల్' టీజర్
ABN, Publish Date - Sep 04 , 2025 | 11:50 AM
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆల్కహాల్'. రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం నాయికలు. మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరెకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హాస్యం ప్రధానంగా సాటి ఈ టీజర్ పై మీరు ఓ లుక్ వేయండి
Updated at - Sep 04 , 2025 | 12:07 PM