Therachaapa: మత్స్యకారుల జీవితాలపై మరో సినిమా...

ABN, Publish Date - May 05 , 2025 | 04:52 PM

సముద్రంను నమ్ముకుని జీవితాన్ని సాగించే మత్స్యకారులపై ఈ మధ్య కాలంలో తెలుగులో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఆ కోవకు చెందిన సినిమానే 'తెరచాప'.

కైలాష్ దుర్గం నిర్మాతగా, జోయల్ జార్జ్ (Joel George) రచనా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'తెరచాప'. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల (Rajeev Kanakala), పృథ్వీరాజ్ (Prudhvi Raj), జగదీష్ ప్రతాప్ బండారి (Jagadeesh Pratap bandari), రాఖి, నాగ మహేష్ (Naga Mahesh), ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం.ఎల్. రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో హీరో కార్తీక్ రత్నం (Karthik Rathnam), 'హరికథ' దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సినిమా టీమ్ పెట్టిన ఎఫర్ట్ అంతా టీజర్ లో కనిపిస్తోందని మ్యాగీ అన్నారు.


ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ, ''ఈ సినిమా హీరో నవీన్ ను చూస్తుంటే తమిళ కథానాయకుడు విక్రమ్ (Vikram) గుర్తొస్తున్నారు. ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడతారో నవీన్ సైతం ఈ సినిమా కోసం అంతే కష్టపడ్డాడు. ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా కష్టపడటంతో ఆస్పత్రి పాలు కూడా అయ్యాడు. అతని కష్టానికి తగిన ప్రతిఫలం విజయం రూపంలో దక్కాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 'తెరచాప'ను మాస్ మూవీగా తెరకెక్కించామని, ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుందని దర్శకుడు జోయెల్ జార్జ్ చెప్పారు. నిర్మాతగా తనకిది తొలి చిత్రమని కైలాష్ దుర్గం తెలిపారు. ఈ వేదికపై నుండి నవీన్ మాట్లాడుతూ, ఈ సినిమా కంటే ముందు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి గురించి చెబుతానన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులపై భారత్ చేసే దాడి వాళ్ళు కలలో కూడా ఊహించనంతగా తీవ్రంగా ఉండాలన్నారు. తన మీద నమ్మకంతో ఈ సినిమాకోసం మూడు కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతకు ధ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని నవీన్ వ్యక్తం చేశారు. ఈ సినిమా టీజర్ తనకెంతో నచ్చిందని కార్తీక్ రత్నం తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది.

Also Read: Mega War: రీ-రిలీజ్ లో ఆసక్తికర పోరు...

Also Read: CPI Narayana: బిగ్‌బాస్ షో.. ఓ ఖ‌రీదైన‌ వ్యభిచారం! బ్యాన్ చేయాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 05 , 2025 | 04:52 PM