Sudheer Babu: తెలుగులోనూ వచ్చేసిన 'జటాధర' ఐటమ్ సాంగ్
ABN, Publish Date - Oct 15 , 2025 | 12:07 PM
సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'జటాధర' (Jatadhara). తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీలోని పబ్ సాంగ్ ను విడుదల చేశారు. సుధీర్ బాబుతో పాటు ఇందులో శ్రేయా శర్మ (Shreya Sharma) నర్తించింది. రాయిస్ అండ్ జైన్, సామ్ ఈ పాటను స్వరపర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పబ్ సాంగ్ ను స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ పాడారు. ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు.