Bahubali - Squid game: బాహుబలి ‘స్క్విడ్‌గేమ్’ ఆడితే..
ABN, Publish Date - Jul 25 , 2025 | 07:29 PM
వెబ్‌సిరీసుల్లో ‘బాహుబలి’, ‘స్క్విడ్‌గేమ్’లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన పొందిన సిరీస్ లు ఇవి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ‘బాహుబలి ఇన్ స్క్విడ్ గేమ్’ అంటూ సినిమా, వెబ్‌సిరీస్‌ను కలిపి క్రియేట్ చేసిన క్రాస్ ఓవర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బాహుబలి’లోని ఆర్టిస్టులు ‘స్క్విడ్‌గేమ్’ ఆడితే ఎలా ఉంటుందో చూపించిన విధానం వీక్షకుల చేత నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..