Praveena Paruchuri: కొత్తపల్లిలో... స్నేహగుప్తా ఐటమ్ సాంగ్ వచ్చేసింది...
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:25 PM
ప్రవీణ పరుచూరి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. రానా సమర్పణలో పరుచూరి ప్రవీణ ఈ సినిమా నిర్మించారు. శుక్రవారం ఈ మూవీ జనం ముందుకు వస్తోంది.
గతంలో 'కేరాఫ్ కంచర పాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలను నిర్మించిన ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) ఇప్పుడు తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని 'కొత్తపల్లిలో ఒకప్పుడు' (Kottapallilo Okappudu) సినిమాను నిర్మించారు. మనోజ్ చంద్ర (Manoj Chandra), మోనిక (Monika) జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇందులో స్నేహా గుప్తాపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు హరీశ్ చక్రవర్తి రచన చేశారు. సాయి శివానీ దీనిని పాడారు. ఫక్తు ఐటమ్ సాంగ్ లానే రికార్డింగ్ డాన్స్ నేపథ్యంలో దీనిని చిత్రీకరించారు. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని, మాస్ ఆడియెన్స్ ను అలరిస్తుందని దర్శక నిర్మాత ప్రవీణ పరుచూరి చెబుతున్నారు.