Suhas: ఓ భామ అయ్యో రామ నుండి సెకండ్ సింగిల్
ABN , Publish Date - May 16 , 2025 | 05:07 PM
సుహాస్ హీరోగా నటిస్తున్న 'ఓ భామ అయ్యో రామ' చిత్రంతో మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మనోజ్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను సెకండ్ సింగిల్ విడుదలైంది.
సుహాస్ (Suhas), మాళవిక మనోజ్ (Malavika Manoj) జంటగా నటిస్తున్న సినిమా 'ఓ భామా అయ్యో రామ' (Oh Bhama Ayyo Rama). మలయాళంలో 'జో' అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోదాల (Ram Godala) దర్శకత్వంలో హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ తో పాటు టైటిల్ సాంగ్ వచ్చాయి. వాటికి చక్కని స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ గా పెళ్ళి పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు రథన్ (Radhan) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాటను శ్రీహర్ష ఈమని (Sriharsha Emani) రాయగా, సాకీని పార్ధు సన్నిధిరాజు రాశారు. టిప్పు, హరిణీ ఈ పాటను పాడారు. హీరోహీరోయిన్లు సుహాస్, మాళవిక మనోజ్ పెళ్ళి సందర్భంగా ఈ పాట వస్తుంది. అయితే మధ్య మధ్యలో మోడర్న్ డ్రస్ లోనూ వారు కనిపించి కనువిందు చేశారు. రఘు మాస్టర్ దీనికి నృత్యరీతులు సమకూర్చారు. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాలలోని కళ్యాణ మండపాలలో ఈ పాట తప్పనిసరిగా వినిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయని, దేనికదే భిన్నంగా ఉంటుందని, కూల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న 'ఓ భామ అయ్యో రామ' అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు రామ్ గోదాల తెలిపారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
Also Read: Anaswara Rajan: మరో మలయాళ బ్యూటీ ఆగమనం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి