Santhana Prapthirasthu: వినోద భరితంగా 'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్
ABN, Publish Date - Nov 06 , 2025 | 06:27 PM
విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాస్తిరస్తు' (Santhana Prapthirasthu). ప్రస్తుతం నవ వధూవరులు ఎదుర్కొంటున్న ఓ బర్నింగ్ ప్రాబ్లమ్ ను బేస్ గా తీసుకుని సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా ఇది. రచయిత షేక్ దావూద్ జి దీనికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను గురువారం ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆవిష్కరించారు. ఓ సీరియస్ ప్రాబ్లమ్ ను ఎంటర్ టైనింగ్ వే లో చెప్పడంలో దర్శకుడు సంజీవ్ రెడ్డి సక్సెస్ అయ్యాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. మీరూ ఒకసారి లుక్కేయండి.