Champion Trailer: ఆసక్తిగా ఛాంపియన్ ట్రైలర్
ABN, Publish Date - Dec 19 , 2025 | 04:32 PM
రోషన్ మేక (Roshan), అనశ్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛాంపియన్'. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్న సినిమా ఇది. నాటి నిజాం హయాంలోని బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు ఏలాంటి దురాఘాతాలకు పాల్పడ్డారు, నాటి ప్రజల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేది, అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఓ యువకుడు ఫుట్‌బాల్ ఛాంఫియన్‌గా ఎలా ఎదిగాడనే ఆసక్తికరమైన కథతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు