సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RamyaKrishna: 'నీలాంబరి'ని మళ్లీ చూసి మురిసిపోయింది

ABN, Publish Date - Dec 22 , 2025 | 12:34 PM

'నీలాంబరి' .. రమ్య కృష్ణ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటి. చాలా పవర్ ఫుల్ రోల్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన  ‘నరసింహ’(పడయప్పాలోని ఈ  పాత్రకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. రమ్య కృష్ణకు ఇదొక ఐకానిక్ రోల్.   ఇటీవల తమిళంలో రీరిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని రమ్యకృష్ణ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేశారు. అందులో ఓ పవర్ఆ ఫుల్ సీన్ ను చూస్తూ మురిసిపోయారు. ఈ సీన్ ను వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  ‘మొదటిసారి ‘నరసింహ’ సినిమాను థియేటర్‌లో చూసేశా’ అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ క్రేజీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Updated Date - Dec 22 , 2025 | 12:42 PM