Sahakutumbaanaam: ఫ్యామిలీ మ్యాన్ ఫెయిల్యూర్ స్టోరీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:57 PM
రాజేంద్ర ప్రసాద్, రాజశ్రీ నాయర్, రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం 'సః కుటుంబానాం'. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తమ 'సః కుటుంబానాం' (Sahakutumbaanaam) కూడా అలాంటి సినిమానే అంటున్నారు దర్శక, రచయిత ఉదయ్ శర్మ. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ (Megha Akash), బ్రహానందం (Brahmanandam), సత్య, గిరి, భద్రం ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు ఉదయ్ శర్మ. ఈ చిత్రానికి మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించారు.
'సః కుటుంబానాం' టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి 'అర్జున్ రెడ్డి' లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరో పక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని భావన కలుగుతోంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో మూవీ పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి. సత్య, బ్రహ్మానందం హాస్యం బాగానే పండేలా ఉంది. మేఘా ఆకాష్ కూ కథానాయికగా మంచి పాత్ర లభించిందనిపిస్తోంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా, ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉండటమే ఈ టీజర్ ప్రత్యేకత. 'ఈ సినిమా తాము ప్రేక్షకులకు అందిస్తున్న చక్కటి తెలుగింటి భోజనం' అని దర్శకుడు ఉదయ్ శర్మ తెలిపారు. ఈ సినిమాను హెచ్. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు.
Also Read: Nagababu: నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాం.. మాదే తప్పు
Also Read: Rashmika Mandanna: సమీరా.. ఓ అందమైన గందరగోళం లాంటిది...