Prithviraj Sukumaran: విడుదలైన 'ఖలీఫా' మూవీ టీజర్

ABN, Publish Date - Oct 16 , 2025 | 04:11 PM

అక్టోబర్ 16 ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం 'ఖలీఫా' (Khalifa) టీజర్ విడుదలైంది. 'ద బ్లడ్ లైన్' పేరుతో ఈ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైశాఖ్ (Vysakh) దర్శకత్వం వహించిన 'ఖలీఫా'... గతంలో వచ్చిన మలయాళ యాక్షన్ చిత్రాల కోవలో సాగినట్టే కనిపిస్తోంది. పృథ్వీరాజ్ నటించిన 'అయ్యప్పన్ కోషియుమ్, రణం, జనగణమన' చిత్రాల తర్వాత జేక్స్ బిజోయ్ మరోసారి 'ఖలీఫా' మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది ఓనమ్ కానుకగా విడుదల కానుంది.

Updated at - Oct 16 , 2025 | 04:18 PM