Peter Teaser: జెస్సీ మళ్లీ వచ్చింది.. ఉత్కంఠగా ‘పీటర్’ టీజర్
ABN, Publish Date - Oct 31 , 2025 | 02:44 PM
రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పీటర్’. సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రమిది. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్డే నిర్మిస్తున్నారు. జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండ వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.