Shambala song: మనసుల్ని తాకే పాట వచ్చేసింది
ABN, Publish Date - Dec 21 , 2025 | 04:48 PM
ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకుడు. అర్చన అయ్యర్, స్వసిక, నాయికలు. డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతోన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి చెప్పే 'పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, యామిని ఘంటసాల గాత్రం, శ్రీ చరణ్ పాకాల బాణీ చక్కగా కుదిరాయి. మనసుల్ని తాకేలా సాగే ఉన్న ఈ పాట పై మీరు ఓ లుక్ఈ వేయండి.