Telugu Cinema: ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'స్కై' నుండి థర్డ్ లిరికల్ సాంగ్
ABN, Publish Date - Nov 11 , 2025 | 03:46 PM
మురళీ కృష్ణంరాజు (Murali Krishnam Raju), శృతి శెట్టి (Shruti Shetty), ఆనంద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'స్కై' (Sky). నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమాను పృధ్వీ పెరిచర్ల (Prudhvi Pericherla) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో శివ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. దీన్ని దర్శకనిర్మాత పృథ్వీ పెరిచర్ల రాయగా, మనీశ్ కుమార్, వైష్ణవి పాడారు. 'నిన్ను చూసిన...' అనే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.