Ghatikachalam Trailer: వాస్తవ ఘటనల హర్రర్ థ్రిల్లర్.. ఘటికాచలం ట్రైలర్ రిలీజ్
ABN, Publish Date - May 23 , 2025 | 01:35 PM
నిఖిల్ దేవాదుల కథానాయకుడిగా ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఘటికాచలం’.
నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘటికాచలం’. వాస్తవ ‘హర్రర్’ ఘటనలతో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అమర్ కామెపల్లి ( Amar Kamepalli) దర్శకత్వం వహించారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.సి రాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ మూవీని డైరెక్టర్ మారుతితో కలిసి ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ రిలీజ్ చేస్తున్నారు.