Aha Video: నెలాఖరు నుండి 'నెట్ వర్క్' వెబ్ సీరిస్
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:33 PM
ఇరవై యేళ్ళు క్రితం 'ప్రేమికులు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కామ్నా జఠల్మాని. కాస్తంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కామ్నా 'నెట్ వర్క్' వెబ్ సీరిస్ లో ఓ కీలక పాత్రను పోషించింది. ఇది ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram) , శ్రీనివాస సాయి (Sreenivasa Sayee), ప్రియా వడ్లమాని (Priya Vadlamani), జామ్నా జఠల్మానీ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'నెట్ వర్క్' (Net Work). ఈ నెల 31 నుండి ఆహా (Aha) లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. సతీశ్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లావణ్య ఎన్.ఎస్., జంగం ఎం గ్రేస్ నిర్మించిన ఈ వెబ్ సీరిస్ కు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఒక్క రోజులో జరిగే నాలుగు కథల సమాహారం ఇది. ఓ క్లిష్టమైన పరిస్థితుల్లో నెట్ వర్క్ మిస్ అయితే... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియచెప్పే వెబ్ సీరిస్ ఇది. తాజాగా దీని ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.