Gharga: సిద్ శ్రీరామ్.. మరోసారి మనసు దోచేశాడు
ABN, Publish Date - Dec 05 , 2025 | 05:00 PM
అరుణ్ రాంప్రసాద్, సాయికుమార్ (Saikumar), సంపత్ రాజ్ (Sampath Raj), రాహుల్ దేవ్ (Rahul Dev) , అరుణ్ సాగర్, మిత్ర, రెహాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న కన్నడ చిత్రం 'ఘార్గా' (Gharga). ఎం. శశిధర్ దర్శకత్వంలో అశ్వినీ రాంప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారం ఇప్పటికే మొదలైంది ఈ సినిమా కోసం ఆర్పీ స్వరపర్చిన బాణీకి బాలాజీ సాహిత్యాన్ని అందించగా, దానిని సిద్ శ్రీరామ్ పాడారు. 'నేల నడిగా... నింగినడిగా... ప్రేమకురిసే చోటిమ్మని...' అంటూ సాగే మెలోడీ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇలాంటి పాటలకు పాడటంలో ఆరితేరిన సిద్ శ్రీరామ్ (Sid Sriram) ఎప్పటిలానే ఈ పాటనూ అద్భుతంగా పాడారు. మీరూ చూసేయండి... Gharga, Sid Sriram, R.P. Patnaik, Balaji, Saikumar, Sampath Raj, Rahul Dev, Gurukiran, Dubbing movie, song out