సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Durga: పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి.. నాగ‌దుర్గ కొత్త పాట వ‌చ్చేసింది

ABN, Publish Date - Nov 28 , 2025 | 12:48 PM

ప్ర‌ముఖ ఫోక్ డ్యాన్స‌ర్‌, ఇటీవ‌ల క‌లివి వ‌నం అనే సినిమాతో క‌థానాయిక‌గా కూడా ఆరంగేట్రం చేసిన జాన‌ప‌ద అగ్ర క‌ళాకారిణి నాగ‌దుర్గ న‌టించిన కొత్త పాట విడుద‌లైంది.

Naga Durga

ప్ర‌ముఖ ఫోక్ డ్యాన్స‌ర్‌, ఇటీవ‌ల క‌లివి వ‌నం అనే సినిమాతో క‌థానాయిక‌గా కూడా ఆరంగేట్రం చేసిన జాన‌ప‌ద అగ్ర క‌ళాకారిణి నాగ‌దుర్గ (Naga Durga)న‌టించిన కొత్త పాట విడుద‌లైంది. పేరుగ‌ల్ల‌ పెద్దిరెడ్డి బిడ్డ‌నో ఓ రామ‌చిల‌కా గావురాలు చేసి పెంచ‌నే రామ చిల‌కా అంటూ తండ్రీ కూతురి మ‌ధ్య బంధాన్ని తెలుపుతూ సాగిన పాట వినిన వెంట‌నే క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

బుల్లెట్ బండి ల‌క్ష‌ణ్ (Bullet Bandi Laxman) సాహిత్యం అందించిన ఈ పాట‌కు మ‌దీన్ (Madeen Sk) సంగీతం అందించ‌గా మ‌మ‌తా ర‌మేశ్ (Mamatha Ramesh) ఆల‌పించింది. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. నాగ‌దుర్గ ఖాతాలో మ‌రో హిట్ సాంగ్‌గా పేరు తీసుకు రావ‌డ‌మే గాక జ‌నంలోకి మ‌రింత‌గా వెళ్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - Nov 28 , 2025 | 12:51 PM