సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saiyaara: జీవనపోరాటన్ని తెలిపేలా ధన్ సాంగ్

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:53 AM

యశ్ రాజ్ ఫిలిమ్స్ మోహిత్ సూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా సయారా. ఈ మూవీని నుండి ఐదో పాట విడుదలైంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) సంస్థ నిర్మిస్తున్న 'సయారా' (Saiyaara) మూవీ నుండి ఇప్పటికే నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలపడం కోసం దర్శకుడు మోహిత్ సూరి నూరు శాతం కృషి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇందులోని 'ధన్' (Dhan) అనే పాట కోసం అర్జిత్ సింగ్, మిథున్, మోహిత్ సూరి తిరిగి కలిశారు.


బాలీవుడ్ లో అర్జిత్ సింగ్ (Arjit Singh), మిథున్ (Mithoon), మోహిత్ (Mohit) ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి రూపొందించిన పాటలు చార్ట్ బస్టర్ లో చోటు సంపాదించుకున్నాయి. 'ఆషికి -2'లోని 'తుమ్ హి హో' పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. అలానే 'జెహెర్, కలియుగ్, మర్డర్ 2, ఏక్ విలన్, హమారి అధూరి కహాని, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, మలంగ్' చిత్రాలకు వీరు కలిసి పనిచేశారు. దాదాపు ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో మెమొరబుల్ సాంగ్స్ తమ నుండి వచ్చాయని, 'సయారా'లోని 'ధన్' సాంగ్ కూడా ఆ జాబితాలో చేరుతుందని మోహిత్ సూరి చెబుతున్నారు. జులై 1న ఈ పాట విడుదలై దగ్గర నుండి చక్కని అప్లాజ్ దక్కుతోంది. జీవితం పూలపాన్పు కాదు, ప్రేమలో, జీవితంలో పోరాటం చేయాల్సిందే అనే భావనతో 'ధన్' సాంగ్ సాగింది. అహాన్ పాండే (Ahaan Panday) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అనీత్ పడ్డా (Aneet Padda) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జులై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Updated Date - Jul 02 , 2025 | 12:04 PM