EDHI MAYA LOKAM: మాయ‌దారి పెళ్లాలు.. నేటి మొగుళ్ల ఆవేద‌న‌ పాట‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:38 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వినూత్నమైన పాట ‘మాయదారి పెళ్లాలు’ సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబిస్తోంది.

EDHI MAYA LOKAM:

ఇటీవ‌ల త‌రుచూ యూట్యూబ్‌లోకి వ‌స్తున్న పాట‌ల‌కు విరుద్ధంగా మాయ‌దారి పెళ్లాలు పేరుతో ఓ వినూత్న‌మైన పాట ఇటీవ‌ల సోష‌ల్ మీడియాకు వ‌చ్చి నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. గ‌డిచిన ఐదారేండ్లుగా మ‌న స‌మాజంలో పెరిగిన సోష‌ల్ మీడియా ప్ర‌భావం, ఆపై భార్య‌లు భ‌ర్త‌ల‌ను అంత‌మొందించిన విధానాల‌ను ఉద‌హారిస్తూ ఈ పాట సాగ‌డం గ‌మ‌నార్హం. సాయి కిర‌ణ్ ముదిరాజ్‌(SAIKIRAN MUDHIRAJ) సాహిత్యం అందించి ఆల‌పించ‌గా మూర్తి (SS MURTHY)సంగీతం అందించాడు.

ఇది మాయ లోకం మంత్ర లోకం రా ఆడోళ్ల రాజ్యం కీలుబొమ్మ‌లు అయిపోతున్రు పెళ్లాల చేతిలో.. పులి లెక్క ఉన్న వాడిని పిల్లిని చేస్తున్న‌రు అంటూ (EDHI MAYA LOKAM SONG) ఈ పాట సాగింది. గ‌డిచిన నాలుగేండ్ల‌లో దేశ వ్యాప్తంగా ఇన్‌స్టా, రీల్స్ పిచ్చి, పెరుగుతున్న లైంగిక సంబంధాలను నేప‌థ్యంగా ఈ పాట‌ను ర‌చించారు. నేడు జ‌రుగుతున్న వ్య‌వ‌హ‌రాల‌ను వివ‌రించారు. ఈ పాట‌కు సంగీతం కూడా స‌రిగ్గా సెట్ అయింది. మీరూ ఓ లుక్కేయండి మ‌రి. ప్రేక్షకుల మనసును తాకే లిరిక్స్‌తో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

Updated Date - Oct 12 , 2025 | 10:38 PM