OG: కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ అదరహో...
ABN, Publish Date - Oct 04 , 2025 | 05:45 PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఓజీ' నుండి ఐటమ్ సాంగ్ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా విడుదల సమయంలో ఎడిటింగ్ కు గురైన 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్ ను ఇటీవల తిరిగి యాడ్ చేశారు. మంగళవారం నుండి 'ఓజీ' మూవీలో ఈ పాట దర్శనమిస్తోంది. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను శ్రీజో రాయగా, సోహా, వాగ్దేవి, మధుబంతి బాగ్చీ పాడారు. దీనిని నేహాశెట్టిపై చిత్రీకరించారు.