Kesari -2: విడుదలైన కేసరి -2 ట్రైలర్

ABN , Publish Date - May 17 , 2025 | 06:15 PM

ఇప్పటికే హిందీలో విడుదలై విజయాన్ని సాధించిన సినిమా 'కేసరి -2'. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో మే 23న గ్రాండ్ గా విడుదల చేయబోతోంది.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ (Kesari Chapter 2: The Untold Story of Jallianwala Bagh) థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ (R. Madhavan), అనన్య పాండే (Ananya Panday) ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి డబ్ అయ్యి, మే 23న విడుదల కాబోతుంది.


తాజాగా 'కేసరి -2' మేకర్స్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ్ కుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ ట్రైలర్ రోమాంచితంగా ఉంది. అక్షయ్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. తన కెరీర్‌లోని అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఆర్. మాధవన్, అనన్య పాండే పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు సమగ్ర పరిశోధనతో పాటు భావోద్వేగంతో నిండిన కోర్ట్ సన్నివేశాలకు రియలిస్టిక్‌గా, ఆకట్టుకునేలా చూపించాడు. డబ్బింగ్ క్యాలిటీ బాగుంది.

ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా 'కేసరి చాప్టర్ -2' చిత్రాన్ని నిర్మించాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. ‘కేసరి ఛాప్టర్ 2’ తో ప్రేక్షకులకు పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లభిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Also Read: NTR BDAY: వార్‌-2 టైమ్‌.. అందుకే అప్‌డేట్‌ లేదు.. మరో రీ రిలీజ్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 17 , 2025 | 06:15 PM