NTR BDAY: వార్‌-2 టైమ్‌.. అందుకే అప్‌డేట్‌ లేదు.. మరో రీ రిలీజ్‌

ABN , Publish Date - May 17 , 2025 | 04:54 PM

తారక్‌ (jr Ntr) పుట్టిన రోజు వస్తుంది అంటే సినీ ప్రియులు, అభిమానులు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. జూ. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.


తారక్‌ (jr Ntr) పుట్టిన రోజు వస్తుంది అంటే సినీ ప్రియులు, అభిమానులు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. జూ. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌తో తెరకెక్కిస్తున్న  వార్‌-2 (war 2) ఇకటి కాగా, రెండోది ప్రశాంత్‌ నీల్‌తో చేస్తున్న డ్రాగన్‌ (Dragon) ఒకటి. ఈ రెండు చిత్రాల నుంచి బర్త్‌డే అప్‌డేట్స్‌ వస్తాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే విచిత్రంగా  ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్‌ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఉండదంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (mythri Movie makers) తాజాగా ట్వీట్‌ చేసింది. ‘‘ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం. మన మాస్‌ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈసారి తారక్‌ పుట్టినరోజును ‘వార్‌ 2’తో చేసుకోండి’’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది మైత్రీ సంస్థ. సో.. ఈసారి తారక్‌ పుట్టినరోజుకు డ్రాగన్‌ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదని అర్థమవుతోంది.

హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan), ఎన్టీఆర్‌ కీలక పాతల్లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌2’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు.  పాన్‌ ఇండియా స్థాయిలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయిక. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని మే 20న సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. గ్లింప్స్‌ను విడుదల చేేస అవకాశం ఉందని తెలుస్తోంది.


YD 5.jpeg

యమదొంగ
రీ రిలీజ్‌..

తారక్‌ కెరీర్‌లో ఐకానిక్‌  సోషియో ఫాంటసీగా నిలిచింది ‘యమదొంగ’ సినిమా. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘యమదొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేయబోతోన్నారు. పుట్టిన రోజు మే 20 కాగా.. అంతకు ముందు నుంచే సంబరాలు ప్రారంభం కావాలని ఈ నెల 18వ తేదీన ‘యమదొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేయబోతోన్నారు. రీ రిలీజ్‌ కోసం టీం చాలానే కష్టపడింది. యమదొంగ మాస్టర్‌ కాపీని 8కె నుంచి స్కాన్‌ చేసి 4కెకి కుదించి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని కలిగించేలా తీర్చిదిద్దారు. ఇప్పుడీ చిత్రాన్ని మరింత క్వాలిటీగా వీక్షించవచ్చు. తారక్‌ సరసన ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌ నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు.  కీరవాణి సంగీతం అందించారు. 

Updated Date - May 17 , 2025 | 04:55 PM