O Cheliya: జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ నుంచి మెలోడీ సాంగ్
ABN, Publish Date - Oct 29 , 2025 | 11:26 AM
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. అందమైన ప్రేమ కథగా ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్నారు. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా మరో ప్రేమ గీతాన్ని రిలీజ్ చేశారు. జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే లవ్, మెలోడీ పాట విడుదల చేశారు. ఎంఎం కుమార్ బాణీ వినడానికి ఎంతో హాయిగా ఉంది. శివ సాహిత్యం , మేఘన, మనోజ్ గాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా కనిపిస్తోంది.జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘‘ఓ.. చెలియా’ నుంచి ‘నా కోసం ఆ వెన్నెల’ అనే ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశాను. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.